తుళ్ళూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
తుళ్ళూరు మండలంలోని తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు వారు పలు సూచనలు చేశారు. తాళ్లాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను గురువారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి ఉన్నారు.