నేర నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు తుళ్ళూరు. సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తుళ్ళూరు మండలంలోని లైబ్రరీ సెంటర్లో ఆయన విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. ప్రజలు స్నేహ పూరితమైన వాతావరణంలో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుళ్ళూరు ఎస్ఐలు అంకమ్మ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.