అమరావతి మునిగిందన్నారు.. చివరకి ఏమైంది: సీఎం చంద్రబాబు
ఎదుటివాడు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు కూడా క్షమించడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి పనులు ప్రారంభం సందర్భంగా తుళ్లూరు పరిధిలో శనివారం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ వరదలకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో వర్గాల ప్రభావాలను చూశారని అన్నారు. అమరావతిని ముంచాలని జగన్ చూశారని అందుకే బెంగుళూరు వరదల్లో ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయిందని అన్నారు.