ఇసుక స్టాక్ యార్డుల్లో నేటి నుంచి ఇసుక లోడింగ్

79చూసినవారు
ఇసుక స్టాక్ యార్డుల్లో నేటి నుంచి ఇసుక లోడింగ్
తుళ్లూరు మండలం లింగాయపాలెం, తాళ్లాయపాలెం ఇసుక స్టాక్ యార్డుల్లో ఆదివారం నుంచి ఇసుక లోడింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు తహశీల్దార్ సుజాత తెలిపారు. భారీ వర్షాలతో తేదీల్లో మార్పులు చేసిన కారణంగా గతంలో లోడింగ్ చేసుకోకుండా ఉన్న లారీలకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఆగస్టు 30న బుక్ చేసుకున్న వారికి సెప్టెంబరు 15, 16 తేదీల్లో లోడింగ్ జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్