తుళ్లూరు: ప్రపంచ బ్యాంకు ప్రతి విషయంలో అగ్రీమెంట్ చేసుకుంది
ప్రపంచ బ్యాంకు ప్రతి విషయంలో అగ్రీమెంట్ చేసుకుందని సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కరరావు అన్నారు. శనివారం ఆయన తుళ్లూరు మండలంలో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 15,000 కోట్లు మొదటి దశ మాత్రమే అని స్పష్టం చేశారు. సిఆర్డిఎ ఒప్పుకున్న అన్ని షరతులతో పనులు పూర్తి చేస్తే మళ్లీ రెండో మారు ఋణం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు.