పాలస్తీనా.. ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై నిషేధం విధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో తమ భూభాగంలో రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో తమ దేశంలో అల్ జజీరాను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక, అంతర్గత, సమాచారశాఖలతో కూడిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్‌జజీరా ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు వివరించారు.