అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో టెస్లా సైబర్‌ట్రక్ మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన లాస్ వెగాస్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.