పొగమంచు కారణంగా ట్రక్కును ఢీకొన్న బస్సు, 24 మందికి పైగా గాయాలు (వీడియో)

82చూసినవారు
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దౌసా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉజ్జయిని నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సు దట్టమైన పొగమంచు కారణంగా ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్