సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త. పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-కాచిగూడ, హైదరాబాద్-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-హైదరాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. జనవరి 2 నుంచి ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.