సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ధర్మ రక్ష దినోత్సవాల్లో భాగంగా భట్టిప్రోలు మండల పరిధిలోని చినపులివర్రు గ్రామంలోని శ్రీరామాలయంలో శుక్రవారం ధర్మ రక్షా దినోత్సవం జరిగింది. జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణకై జీవితాంతం కృషి చేసి 84ఏళ్ల వయసులో మతఛాందస్తవాదుల కాల్పులతో మరణించిన లక్ష్మణానంద సరస్వతి స్వామి సంస్మరణ దినాన్ని ధర్మరక్ష దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.