స్కూల్ కమిటీ ఎన్నికల ఓటర్ల జాబితా నోటిఫికేషన్ విడుదల

74చూసినవారు
పాఠశాల కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ను గురువారం అమృతలూరు జెడ్పీ హైస్కూల్ హెచ్. ఎం, కనపర్తి నిరీక్షణరావు విడుదల చేశారు. ఈ నెల 8న ఎన్నిక జరుగుతుందని ప్రతి తరగతి ముగ్గురు సభ్యులను ఎన్నుకుని వారిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం లెటర్ ద్వారా తెలియ జేస్తామని చెప్పారు. ఉపాద్యాయులు రవి, శాంతి, రత్నకుమారి, రత్న, సూర్యశ్రీ, మేరీ ప్రశాంతి, జయశ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్