బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించినట్లు మంగళవారం ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ. మూగచింతల పాలెం గ్రామానికి చెందిన నర్సు కుమారి తన ఇద్దరు చిన్నారులను తీసుకొని కనపడకుండా వెళ్ళిపోయిందని ఆమె అన్న కోటేశ్వరరావు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గుంటూరులో ఉన్నట్లు గుర్తించి వారిని బంధువుల చెంతకు చేర్చామన్నారు.