వేల్పూరులో పోలీస్ పికెట్ ఏర్పాటు

551చూసినవారు
వేల్పూరులో పోలీస్ పికెట్ ఏర్పాటు
శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జరుగుతున్న ఘర్షణలను నివారించేందుకు పోలీసులు మంగళవారం పికెట్ ఏర్పాటు చేసినట్టు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళలో పోలీసు బలగాలను మోహరించామన్నారు. గ్రామాలలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్