జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

79చూసినవారు
జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ.. వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తమకు నోటీసులు అందలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం జగన్ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్