తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వక్క సాగు పెరిగింది. దీనిని కొబ్బరి, కోకో తోటల్లో అంతరపంటగా రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి 500 వక్క చెట్లను నాటుకోవచ్చు. ఐదేళ్ళ తరువాత దీనిపై ఆదాయం వస్తుంది. వక్క సాగుకు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీటికి పేడ, నీరు, మట్టిని అందిస్తే సరిపోతుంది. సాగు మొదలు పెట్టాక 45 ఏళ్ల పాటు ఆదాయం పొందొచ్చు. మార్కెట్‌లో వక్క క్వింటాల్ ధర రూ.52 వేల వరకు పలుకుతోంది.