ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తి నీటి విడుదల

72చూసినవారు
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్