AP: ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీకి బుద్ధి రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. పంట బీమా అమలుపై ట్విట్టర్ వేదికగా వైసీపీపై ఆయన మండిపడ్డారు. గత పాలనలో బీమా అంశంలో రబీలో సాగు చేసిన రైతులను పూర్తిగా గాలికి వదిలేసి నేడు ముసలి కన్నీరు కారుస్తున్న వైసీపీకి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో కేవలం నాలుగేళ్లు ఒక సీజన్‌కే బీమా అమలు చేసి రైతులను మోసం చేశారని విమర్శించారు.