ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రోన్, సీసీ కెమెరాలతో వరద పరిస్థితిని అంచనా వేయాలని అధికారులకు ఆదేశించారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఆయా జిల్లాల్లో అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.