చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సిట్‌లోని ముగ్గురు సభ్యులు మహిళా ఐపీఎస్ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.