చాలాసార్లు ఆహారం మిగిలిపోయినప్పుడు మనం దానిని ఫ్రిజ్‌లో ఉంచుతాం. దానినే తర్వాత బయటకు తీసి వేడి చేసి మళ్లీ తింటుంటాం. అయితే ఇది ఎంత పెద్ద ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి మొదట ఫ్రిజ్‌లో ఉంచిన పాత చికెన్‌ను బయటకు తీశాడు. దానిని మైక్రోస్కోప్‌లో పెట్టి చూడగా వేలాది సంఖ్యలో సూక్ష్యజీవులు, కీటకాలు ఉండడం గమనించవచ్చు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.