ఏపీని ఫెంగల్ తుఫాన్ వీడలేదు. అల్పపీడనం తుఫానుగా మారి తీరం దాటినప్పటికీ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓ వైపు వర్షం కురుస్తుండగా మరోవైపు ఎండ కాస్తుంది. మళ్లీ భారీ వర్షం పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి, పొగాకు పొలాలు నీట మునిగాయి.