ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డులో కల్వర్టు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు తెగి పైపులు కొట్టుకుపోయాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం
అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోని వరద నీరు చేరింది. పత్తికొండ-ఆదోని మార్గంలో రోడ్డుపై వరద నీరు చేరింది. చిన్న హుల్తీ సమీపంలోని హంద్రీవాగుకు భారీగా వరద నీరు చేరింది.