ఏపీకి హై అలర్ట్.. 3 రోజులు దంచి కొట్టనున్న వర్షం

56చూసినవారు
ఏపీకి హై అలర్ట్.. 3 రోజులు దంచి కొట్టనున్న వర్షం
ఏపీ వాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మళ్లీ వానలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్