కేంద్ర వ్యవసాయశాఖ’ నివేదిక ప్రకారం దేశంలో ఏటా పారేస్తున్న ఆహారం విలువ సుమారు రూ.50 వేల కోట్లు. యూఎన్‌ఈపీ నివేదిక ప్రకారం దేశంలో ఏటా వృథా అవుతున్న ఆహారం 6.87 కోట్ల టన్నులు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం మన దేశంలో ఆహార ఉత్పత్తుల్లో మూడో వంతు తినేందుకు ముందే పాడవుతున్నాయి. ఇళ్ల వద్ద 21 శాతం ఆహారం వృథా అవుతుండగా, హోటళ్లు, రెస్టారెంట్లలో 26 శాతం, వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో 13 శాతం ఆహారం వృథా అవుతోంది.