AP: రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పగటి పూట 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా ఆదివారం కర్నూలులో 38.5°C ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావం వల్ల ఎండ అధికంగా ఉంటోందని తెలిపింది.