అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కరిగానపల్లి సమీపంలో పట్టపగలే ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. తరచూ ఎలుగుబంట్లు పంట పొలాలు నాశనం చేస్తున్నాయని, రైతులపై దాడి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.