AP: సేంద్రియ వ్యవసాయానికి తానే శ్రీకారం చుట్టినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలో సీఎం మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తాం. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి' అని చంద్రబాబు అన్నారు.