తాను ఉంటున్న ఇంటిని తప్పా మిగతా ఆస్తిని దువ్వాడ వాణికి ఇచ్చేందుకు సిద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఇంటిని వదిలేస్తే తనకు చావే శరణ్యమన్నారు. ఉన్న ఒక్క ఇంటిని వారే లాక్కుంటే తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. వాణి పిల్లలను తనపైకి ఉసిగొల్పిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు.