ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువగా బెంగళూరు నివాసంలో ఉండటానికే ఇష్టపడతున్నారు. అయితే ఇందుకు ఓ కారణం ఉందంట. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హైదరాబాద్‌లో కాకుండా ఆయన భార్యతో కలిసి బెంగళూరు నివాసంలో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.