వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్లు, స్క్రాప్ మొత్తం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. కార్యకర్తలను చూస్తుంటే నాకు ధైర్యం మరింత రెట్టింపు అవుతుందని ఎంపీ పేర్కొన్నారు.