అవినీతిపై జగన్ మాట్లాడటం వింతగా ఉంది: లోకేశ్

65చూసినవారు
అవినీతిపై జగన్ మాట్లాడటం వింతగా ఉంది: లోకేశ్
హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. "రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్