తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

57చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  మరో రెండు రోజులు చల్లని గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని చింతపల్లిలో 7.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగి, పాడేరులో చలి వణికిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్