ఈ నెల 18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు

64చూసినవారు
ఈ నెల 18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు
AP: ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయ‌నున్న‌ట్లు ఆ పార్టీ కీల‌క నేత, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో 10 రోజులపాటు నాలుగో విడత సభ్యత్వ నమోదు ప్ర‌క్రియ కొన‌సాగనుంద‌ని తెలిపారు. ఈసారి 9 లక్షల సభ్వత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యమ‌ని జనసేన నాయకులతో నిర్వ‌హించిన టెలీ కాన్ఫరెన్స్‌లో నాదెండ్ల వివ‌రించారు.

సంబంధిత పోస్ట్