VIDEO: నిండు సభలో కన్నీళ్లు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌!

58చూసినవారు
అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అన్నారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో ఆయన నేడు భావోద్వేగంగా ప్రసంగించారు. కుటుంబ సమేతంగా బైడెన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వేదికపైకి రాగానే ఆయన కుమార్తె యాష్లీ బైడెన్‌ పరిచయ వాక్యాలు మాట్లాడుతూ.. ‘నా తండ్రి ఆడపిల్లల పక్షపాతి. ఆయన మహిళలకు విలువనివ్వడం, నమ్మడం నేను చూశాను’ అని పేర్కొన్నారు. ఈ మాటలకు జోబైడెన్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్