రక్షా బంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం మహిళా డ్రైవర్లకు చలాన్లు జారీ చేయడం నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలకు భద్రత కోసం పోలీసులు హెల్మెట్‌లను కూడా పంపిణీ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా నిబంధనలను పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని, ట్రాఫిక్ వ్యవస్థను సజావుగా నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.