కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ కేసును విచారించనుంది. బాధితురాలికి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.