ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు ఆయన వచ్చారు. దాడి ఘటనపై జోగి రమేశ్‌ను పోలీసులు విచారించనున్నారు. కాగా, విచారణ కోసం 2022లో వాడిన ఫోన్, ఆరోజు ఆయనతో వచ్చిన కార్ల నెంబర్లను కూడా తీసుకురావాలని జోగి రమేష్ కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.