Mar 27, 2025, 11:03 IST/ములుగు
ములుగు
ములుగు: మాభూమిని కొందరు కబ్జా చేస్తున్నారు: మంజుల
Mar 27, 2025, 11:03 IST
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ సమీపంలో తమ కుటుంబ సభ్యులందరికీ చెందిన 12 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని గురువారం జంపాల మంజుల ఆరోపించారు. తమకు తెలియకుండా తమ భూమిలో పోల్ ను పాతి, వేరే వ్యక్తులకు కౌలుకు ఇచ్చారని అన్నారు. అందుకే హద్దు రాళ్లను తాము తొలగించినట్లు తెలిపారు. తాము కష్టపడి సంపాదించిన భూమిని ఎవరో కబ్జా చేస్తుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని రోధించారు.