బిజెపి వైసిపి పై పోరాటం- సిపిఐ సిపిఎం ప్రచార బేరి లక్ష్యం

172చూసినవారు
బిజెపి వైసిపి పై పోరాటం- సిపిఐ సిపిఎం ప్రచార బేరి లక్ష్యం
బద్వేల్ స్థానిక డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి నాలురోడ్ల కూడలిలోని సి. ఐ. టి. యు. కార్యాలయం వరకు బి. జె. పి హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార జాత ర్యాలీ శనివారం నిర్వహించారు. సి. ఐ. టి. యు. కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సి. పి. ఎం. జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ లు మాట్లాడుతూ.. నేడు దేశంలోని బి. జె. పి. ప్రభుత్వం ఆర్. ఎస్. ఎస్. నియంత్రణలో పనిచేస్తుందని విమర్శించారు. లౌకిక భారతదేశంలోని చట్టాలన్నీ హిందుత్వ చట్టాలుగా మారుస్తోందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య, సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు ఇ. రమణ, గిలక రాజు, ఎస్. మస్తాన్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం. చిన్ని , డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు షరీఫ్, నాగార్జున, చేతి వృత్తిదారుల నాయకులు పి. నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు రాయప్ప, తదితర సిపిఎం, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్