బద్వేల్ : ఎమ్మెల్సీ డీసీని కలిసిన శ్రీకాంత్ రెడ్డి
వైఎస్సార్ కడప జిల్లా వైసీపీ సేవాదళం అధ్యక్షుడిగా నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పోరుమామిళ్లలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలశాలవాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ. ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.