
గాలివీడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు
గాలివీడు మండలం తోటవారి పల్లి గ్రామం పేరాల గుట్ట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ(48) కు తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాలివీడు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.