TG: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి హల్ చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. అయితే బట్టలు వేసుకొని స్వామి వారి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి.. తాను తెచ్చిన కత్తితో పలువురిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.