రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్ తో పాటు శాసనసభ, మండలి విప్ గా 15 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని శాసనసభ విష్ గా నియమించారు. అయితే టీడీపీ నుంచి 15 మందికి, జనసేనలో నలుగురికి చోటు దక్కింది. కాగా బీజేపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి మాత్రమే నిలిచారు. దీంతో మంగళవారం ఆయన అభిమానులు, కార్య కర్తలు సంబరాలు చేసుకున్నారు.