డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని సోమవారం రాత్రి జిల్లాకు రానున్నారు. విషయాన్ని కలెక్టర్ హరికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం అనంతపురం నుంచి రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన భారతి సిమెంట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడ బస చేస్తారన్నారు. ఏడో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భారతి సిమెంట్ గెస్ట్హౌస్ నుంచి కలెక్టరేట్ లో జరిగే సమావేశానికి చేరుకుంటారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు.