ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్రంలో కోటీ 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే సర్కార్ మాత్రం 9 లక్షల 65 వేల కనెక్షన్లకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనుందని సమాచారం. అంటే మొత్తం కనెక్షన్లలో 10 శాతం కూడా లేకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇలా చేస్తే ప్రభుత్వం మహిళాగ్రహానికి గురికాక తప్పదని అంటున్నారు.