జాతీయ రహదారులలో లారీలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న 9 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు కడప ఇన్చార్జి డిఎస్పి రమాకాంత్ తెలిపారు. శనివారం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ 9 మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో హైవేలలో లారీలను ఆపి డ్రైవర్ల వద్ద నగదు, సెల్ ఫోన్లను దోచుకునేవారన్నారు. నిందితుల వద్ద నుంచి ఒకటిన్నర కిలో గంజాయి, మూడు బైకులు, రూ. 14080 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.