ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కె. ఒ. అర్. యం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ లిఖిత రెడ్డి అన్నారు. శనివారం కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హెచ్‌డిఎఫ్‌సి వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. 47 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్, ఎన్. యస్. యస్ కో-ఆర్డినేటర్, విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.