కమలాపురం పట్టణంలోని రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ రాధాకృష్ణ ఆలయంలో శుక్రవారం పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.