కడప జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల గ్రామంలో దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో శనివారం తెల్లవారు జామునుండి శ్రీ సీతారాముల, శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మణోత్తముల వేద మంత్రాల నడుమ 12 మంది జంటలతో పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రముఖ సర్జన్ డాక్టర్ నాగేశ్వర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, జాతీయ జర్నలిస్ట్ సంఘం(ఎన్ యు జె) (ఇండియా) కార్యదర్శి వి. రాజేందర్ నాథ్ హాజరయ్యారు.