అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో వెలసిన ముత్తు మారమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆగస్టు 11, 12, 13 తేదీలలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అమ్మవారి జాతర మహోత్సవానికి ఇతర జిల్లాల నుండి కూడా వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.